షాకింగ్; లాక్ డౌన్ సమయంలో భార్యలను వేధిస్తున్న భర్తలు…!

-

లాక్ డౌన్ దెబ్బకు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి దాదాపుగా లేదు అనే సంగతి అందరికి తెలిసిందే. మగవాళ్ళు ఆడాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు అనేవి లేవు. దీనితో ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కూడా కోల్పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో భర్తలు ఎం చేస్తున్నారు అనేది చూస్తే,

భార్యలను భర్తలు హింసిస్తున్నారని, లాక్‌డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా గృహహింస పెరిగిపోయిందని, యూకేలో గృహ హింస ఫిర్యాదులు 25 శాతం పెరిగాయని ఒక సంస్థ వెల్లడించింది. రేఫ్యూజ్ అనే సంస్థ చేసిన ఈ సర్వేలో ఈ దారుణమైన విషయం బయటపడింది. నేషనల్ డొమెస్టిక్ అబ్యూస్ హెల్ప్‌లైన్ నిత్యం వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని, ఆన్‌లైన్ పోర్టల్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.

లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఇంగ్లండ్, వేల్స్‌లో సుమారు 16 లక్షల మంది భర్తల నుంచి వేధిపులు ఎదుర్కొన్నారని పేర్కొంది. ఇక మన దేశంలో కూడా ఈ కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ మహిళా కమీషన్ పేర్కొంది. ఫిబ్రవరిలో 111గా ఉన్న ఫిర్యాదుల సంఖ్య మార్చిలో ఏకంగా 257కి చేరిందని తమ ప్రకటనలో పేర్కొంది. భార్యలకు భద్రత కరువు అయింది అనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news