దేశంలో అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దిశా అత్యాచారఇవహత్య తర్వాత తెలంగాణా పోలీసులు కఠినంగా వ్యవహరించినా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ప్రతీ రోజు ఏదొక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా ఎన్ని చట్టాలు చేస్తున్నా ఈ ఘటనలు మాత్రం ఆగకపోవడం ఆందోళన కలిగించే అంశం. కామాంధులు రెచ్చిపోతూ ఆడపిల్లలు కనపడితే చాలు మృగాళ్ళ మాదిరి చెలరేగిపోతున్నారు.
అయితే తాజాగా ఒక దారణ ఘటన చోటుచేసుకుంది. కాపాడాల్సిన పోలీసే బాలిక మీద అత్యాచారం చేసిన ఘటన ఈశాన్య రాష్ట్రమైన అసోంలో చోటు చేసుకుంది. అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌లాంగ్ పట్టణంలో కర్బీఅంగ్‌లాంగ్ ఎస్పీగా పనిచేస్తున్న గౌరవ్ ఉపాధ్యాయ్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అసోంలో కలకలం రేపింది. దీనిపై స్పందించిన పోలీసు కమిషనర్ ఎంపీ గుప్తా బాలిక ఫిర్యాదుపై తాము చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్ పై పోస్కో చట్టం సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.