సంచలనం: జేఎన్‌యూలో దాడి చేసింది ఉగ్రవాదులేనా…? రంగంలోకి అమిత్ షా…!

-

దేశ రాజధాని ఢిల్లీలో జేఎన్‌యూలో ఆదివారం సాయంత్రం జరిగిన హింసాకాండపై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వశాఖ ఈ హింసాకాండ మీద ఆరా తీస్తోంది. 50 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీ ప్రాంగణంలోని సబర్మతి, మహిమాండ్వి, పెరియార్‌ హాస్టళ్లలోకి చొరబడి అధ్యాపకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని లాఠీలు, రాడ్లు, సుత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపద్యంలో స్పందించిన మానవ వనరుల శాఖ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తుంది. సోమవారం జేఎన్‌యూ రిజిష్ట్రార్, ప్రొక్టర్, రెక్టార్ లు తమ శాఖ కార్యాలయానికి రావాలని కేంద్ర మానవవనరుల శాఖ కార్యదర్శి ఆదేశించారు. వారితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనలో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ తల పగిలింది. అదే విధంగా హింసాకాండలో తీవ్రంగా,

గాయపడిన 18 మంది బాధితులు ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన వర్సిటీ పరిపాలన విభాగం అధికారులు దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసారు. ఈ దాడి ఘటనపై నివేదిక సమర్పించాలని కేంద్ర మానవ వనరుల శాఖ జేఎన్‌యూ వీసీని కోరినట్టు సమాచారం. స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అదేశాలు జారి చేసినట్టు సమాచారం. విద్యార్దుల ముసుగులో ఉగ్రవాదులు ప్రవేశించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news