కెఎఫ్‌సి చికెన్ ను తింటున్నారా?..మీ పని గోవిందా..

-

చికెన్ పేరు వినగానే అందరికి నోరు ఊరిపోతుంది… ఎప్పుడెప్పుడు తిందమా అని అందరికి ఆశగా ఉంటుంది.. ఇక ఇలాంటి వాళ్ళను తమ హోటల్ కు రప్పించడానికి కొత్త కొత్త వంటలను చేస్తూన్నారు. అయితే అన్నీ ఆరోగ్యానికి మంచివి కావు..వీటి గురించి ఎంత చెప్పిన కూడా చాలా మంది వినరు..అయితే భోజన ప్రియులను ఎక్కువగా ఆకర్షిస్తున్న చికెన్ అంటే అందరూ కెఎఫ్‌సి పేరునే ఎక్కువగా చెబుతారు. ఒకప్పుడు కాస్ట్, క్వాలిటీ లో ది బెస్ట్ అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం జనాలు భయపడుతున్నారు.

మొన్నీమధ్య చికెన్ లో పురుగులు వచ్చాయి.. నిన్న ఈ చికెన్ లో కుళ్ళిపోయింది.. ఇప్పుడు ఏకంగా ప్లాస్టిక్ పదార్థాలు కనిపించాయని అంటున్నారు.అసలు విషయాన్నికొస్తే.. కెఎఫ్‌సి చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థం కనిపించింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ కింద కెఎఫ్‌సిలో ఔట్‌లెట్‌లోని చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి.స్విగ్గీ ద్వారా చికెన్ బకెట్‌ను సాయితేజ అర్డర్ చేశాడు. చికెన్ తింటుండగా ప్లాస్టిక్ పదార్థం కనిపించడంతో ఫోటోలు వీడియోలు తీసి జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. కెఎఫ్‌సి ఔట్‌లెట్‌లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేశాడు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు అధికారులు పంపారు..

వంట చేస్తున్న సమయంలో చేసిన చిన్న పొరపాట్లు ఇప్పుడు దుకాన్ బంద్ అయ్యే స్థితికి తీసుకువస్తున్నాయి. ఒక్క కెఎఫ్‌సి మాత్రమే కాదు..ప్రముఖ ఫుడ్ హోటల్స్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది.. ఇటీవల ఫెమస్ బిర్యాని పాయింట్ బావర్చి బిర్యాని లో బల్లి వచ్చిన సంగతి తెలిసిందే..అందుకే ఇప్పుడు జనాలు బయట తినాలంటే భయపడుతున్నారు.. మీరు కూడా బయట తినే ముందు ఆలొచించి తినడం మేలు..డబ్బులిచ్చి మరీ జబ్బులను కొని తెచ్చుకోవడం ఎందుకు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news