గూగుల్ ఫొటోస్ వాడే వాళ్లకు షాకింగ్ న్యూస్

జూన్ 1 నుండి గూగుల్ ఫోటోస్ యాప్ వాడే వాళ్లకు సంస్థ షాక్ ఇచ్చింది. ఇక రేపటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. 15 జీబీ మాత్రమే మీకు అనుమతి ఉంటుంది అని సంస్థ పేర్కొంది. ఇక క్వాలిటీ ఎక్కువగా ఉండే ఫొటోస్ మీరు దాచుకోవాలని భావించినా సరే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్లాన్స్ ని కూడా గూగుల్ ఫొటోస్ ప్రకటించింది.

100 జీబీ: గూగుల్ ఈ స్టోరేజ్ ప్లాన్ నెలకు రూ .130 మరియు సంవత్సరానికి 1300 రూపాయలు చెల్లించాలి.

200 జీబీ: గూగుల్ అందించే ఈ స్టోరేజ్ ప్లాన్ నెలకు రూ .210, సంవత్సరానికి రూ .2100.

2 టిబి: ఈ ప్లాన్ నెలకు 650 రూపాయలకు మరియు సంవత్సరానికి 6500 రూపాయలకు అదనపు ప్రయోజనాలతో వస్తుంది.