పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ నుంచి షాకింగ్ పోస్టర్ రిలీజ్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓ జి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే సినిమా పైన లేదని చెప్పాలి.

ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరొక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజైంది. దీనిని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.ఇందులో పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ ధరించి కత్తితో విలన్లను నరుకుతున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ అభిమానులకి ఈ పోస్టర్ గూస్బంప్స్ తెప్పించేవిధంగా ఉంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news