క్రికెట్ లో ఇలాంటి షాట్ కూడా ఉంటుందా…?

-

క్రికెట్ లో వింత షాట్ లు కొట్టడం కొత్తేమి కాదు… టి20 క్రికెట్ వచ్చిన తర్వాత బంతి దొరికితే చాలు బాదేస్తున్నారు. స్కోర్ బోర్డు ని పెంచే క్రమంలో షాట్ లు ఆడటానికి ఒక విధానం అంటూ లేకుండా పోయింది అనేది వాస్తవం. ఇక అభిమానులు కూడా వింత షాట్ లకు ఇష్టపడటం తో బ్యాట్స్మెన్ వాటి కోసం ప్రయత్నిస్తూ విజయవంతం కూడా అవుతున్నారు. మైదానం నలుమూలలా భారీ షాట్ లు ఆడుతూ… అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఎన్నడు చూడని షాట్ లను చూస్తుంది.

తాజాగా న్యుజిలాండ్ లో జరిగిన దేశవాళి మ్యాచ్ లో ఒక షాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే… శుక్రవారం ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా ఓటాగో వర్సెస్ వెల్లింగ్టన్ మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో ఓటాగో బ్యాట్స్మెన్ నీల్ బ్రూమ్ సెంచరి చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 13 బౌండరీలు నమోదు చేసిన అతను… ఒక వింత షాట్ కూడా ఆడాడు. వెల్లింగ్టన్ కెప్టెన్ హమీష్ బెన్నెట్ నెమ్మదిగా బౌన్సర్ వేయగా… నీల్ బ్రూమ్… ఆ బంతిని స్కూప్ ఆడాడు… రెండు కాళ్ళు గాల్లోకి లేపి తల వంచి ఆడిన ఆ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతక ముందు ఇలాంటి షాట్ ఎప్పుడైనా చూసారా అంటూ ఓటాగో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 36 ఏళ్ళ నీల్ ఆడిన షాట్ కి మైదానంలో అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఓటాగో నిర్ణీత ఓవర్లలో 262 పరుగులు చేసింది. నీల్ బ్రూమ్… 112 పరుగులు చేసాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన వెల్లింగ్టన్ జట్టు… 49.5 ఓవర్లకు గాను… 260 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. వెల్లింగ్టన్ జట్టు 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోగా మాల్కామ్ నోఫాల్ (87), డెవాన్ కాన్వే (70) పరుగులతో జట్టుని ఆదుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news