ప్రియాంకారెడ్డి హ‌త్య కేసులో బ‌య‌ట‌కొచ్చిన మ‌రో కీల‌క విష‌యం..

-

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు స్వల్పకాలంలోనే ఛేదించారు. పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి అపహరణ, అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే సంచలనంగా మారిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్రియాంక ను కాళీ ప్లేస్ ఉన్న గదిలోకి తీసుకు వెళ్ళిన నిందితులు.. గది తలుపులు తెరుచుకోకపోవడంతో బయటే అత్యాచారం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

లారీని అడ్డం పెట్టి ఆమెపై దాడి చేసిన నిందితులు.. పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అత్యాచారం చేసిన ప్రదేశానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో స్కూటీని పడేశారు. అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో ప్రియాంకను దహనం చేశారు. అలాగే మృతదేహానికి దుప్పటి చుట్టి కిరోసిన్ పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రియాంకరెడ్డి 70శాతం కాలిపోయిట్లు వైద్యులు తెలిపారు. కాగా, దేశం మొత్తం ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. ప్రధాని కార్యాలయం తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు సేకరించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news