ఒక గ్రామంలో ఎంత మంది దొంగలు ఉంటారు…? ఉంటే మహా అయితే పది మంది ఉంటారు. లేదా 20 మంది ఉంటారు. కాని ఆ గ్రామం మొత్తం దొంగలే. అదేంటి అంటారా…? ఈ స్టొరీ చదవండి ఒకసారి. సాధారణంగా OLX లాంటి సైట్స్ లో చాలా మంది సెకండ్ హ్యాండ్ వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ ఉంటారు. మంచి వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయించడమో లేక వినియోగించడమో చేస్తూ ఉంటారు.
చాలా మంది ఈ సైట్ ని అందుకే వాడతారు. ఇందులో మోసాలకు కూడా కొదవ ఏమీ లేదు. వందల కొద్దీ మోసాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది నమ్మి మోసపోతూ ఉంటారు. నకిలీ వస్తువులు ఇవ్వడమో నమ్మించి మోసం చేయడమో చేస్తూ ఉంటారు. ఇలా చేయడానికి రాజస్థాన్ లో ఒక గ్రామం గ్రామమే ఉంది. దునావాల్ పరిధిలోని భరత్ పురా అనే గ్రామం అది. ఆ గ్రామం మొత్తం ఈ మోసాలతోనే బతుకుతుంది.
తాజాగా చెన్నై కి చెందిన కొందరిని ఇలాగే మోసం చేస్తే తమిళనాడు పోలీసులు వారిని గుర్తించి రాజస్థాన్ వెళ్ళారు. అక్కడికి గ్రామంలోకి ప్రవేశించగానే గ్రామస్తులు అందరూ వారిని అడ్డుకున్నారు. మోసం చేసిన ముఠా ని పట్టుకోవడానికి వెళ్తే అడ్డు చెప్పారు. దీనితో పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది ఒక్కసారే. ఎం జరుగుతుందో అర్ధం కాలేదు. వెంటనే ఆరా తీసారు పోలీసులు. రాజస్థాన్ పోలీసుల సహకారం తీసుకున్నారు.
ఆ గ్రామం పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉందట. దీనితో సైనిక వాహనాలు, కార్లు, బళ్ళు తక్కువ ధరకు ఇస్తామని ముఠా మోసం చేస్తుందని వాళ్ళు చెప్పారు. ఆ డబ్బుతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పారు రాజస్థాన్ పోలీసులు. దీనితో తమిళనాడు పోలీసులకు మైండ్ పోయింది. గ్రామంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ మోసగాళ్ళే అని చెప్పారు అక్కడి పోలీసులు. మోసం చేసిన ముఠా ని అరెస్ట్ చేయడానికి అక్కడి పోలీసుల సహకారం తీసుకున్నా ఉపయోగం లేక వెనక్కి వచ్చేశారు.