ప్ర‌గ‌తి కేసులో సంచ‌ల‌నాలు..న్యూడ్ ఫోటోలు, వీడియోల‌తో కాబోయే భ‌ర్త‌ బ్లాక్ మెయిల్ వ‌ల్లే…!

ఆస్ట్రేలియా సంబంధం వ‌చ్చింద‌ని ఆ అమ్మాయి సంబుర‌పడింది. పెళ్లి ఫిక్స్ అవ్వ‌డంతో కాబోయేవాడే కాదా అని చ‌నువుగా మెదిలింది. కానీ వాడో రాక్ష‌సుడ‌న్న నిజం తెలుసుకోలేక‌పోయింది. ఫారెన్ పెళ్లి కొడుకు అస‌లు స్వ‌రూపం తెలిసి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే….రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రంకు చెందిన ప్ర‌గ‌తి అనే యువ‌తికి అదే మండలానికి చెందిన ర‌మేష్ అనే యువ‌కుడితో పెళ్లి నిశ్చ‌యం అయ్యింది. ర‌మేష్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండ‌టంతో ప్ర‌గ‌తి కుటుంబం త‌మ కూతిరి జీవితం భాగుంటుంద‌ని క‌ల‌లు క‌నింది. ఇక ఎంగేజ్మెంట్ కూడా అవ్వ‌డంతో ప్ర‌గ‌తి కార్తీక్ తో చ‌నువుగా మెదిలింది. ఈ క్ర‌మంలో కార్తీక్ ప్ర‌తి రోజూ వీడియోకాల్స్ చేయ‌డం మాట్లాడ‌టం చేసేవాడు. అంతే కాకుండా ఇటీవ‌ల స్వగ్రామానికి రాగా ప్ర‌గ‌తి ఇంటికి వ‌చ్చి చ‌నువుగా ఉన్నాడు.

crime news rangareddy
crime news rangareddy

ఇక ఆ త‌ర‌వాత నుండి త‌న‌కు క‌ట్నం ఎక్కువ కావాల‌ని తాను ఆస్ట్రేలియా పెళ్లి కొడుకును అని వేధించ‌డం మొద‌లు పెట్టాడు. క‌ట్న కానుక‌ల విష‌యంలో ఇరు కుంటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌టంతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో కార్తీక్ త‌న‌తో మాట్లాడిన వీడియో కాల్స్ ను చ‌నువుగా దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం మొద‌లు పెట్టాడు. దాంతో ప్ర‌గ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ త‌ర‌వాత కుటుంబ స‌భ్యులు కార్తీక్ పై ఫిర్యాదు చేయ‌గా వాట్స‌ప్ చాట్ ను ప‌రిశీలించిన పోలీసులు కాబోయేవాడి వేధింపుల వల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు నిర్ధారించి క‌ట‌క‌టాల్లోకి నెట్టారు.