భోజనం తరువాత నడిస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా…!

-

ఇప్పుడున్న ఆధునిక జీవన శైలికి ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. భోజనం చేసిన తర్వాత పడుకోవడమో .. విశ్రాంతి తీసుకోవడమో.. చేస్తున్నాం తప్పితే నడకపై శ్రద్ధపెట్టడం లేదు. సాయంత్రం భోజనం ముగించిన వెంటనే దుప్పటి కప్పి నిద్రలోకి జారుకుంటున్నాం. ఇలా చేస్తే దీర్ఘకాలంలో అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్లం అవుతాం. అదే  భోజనం చేసిన తర్వాత నడిస్తే చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరంలో ఆహారం జీర్ణం కావడానికి చిన్న పేగులు ఎంతో సహకరిస్తాయి. ఆహారంలోని పోషకాలను గ్రహంచడంలో చిన్న పేగులదే ప్రధాన పాత్ర. ఆహారం తిసుకున్న తరువాత ఒక అరగంట నడిస్తే జీర్ణాశయం నుంచి ఆహారం సులువుగా చిన్న పేగుల్లోకి చేరుతుంది. ఫలితంగా ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మలబద్దకాన్ని దూరం చేసుకోవచ్చు. మరోవైపు తిన్న తరవాత క్రమం తప్పకుండా నడక అలవాటు చేసుకుంటే షుగర్ వ్యాధి దరిచేరే అవకాశం లేదు. డయాబెటిక్ వ్యాధి ఉన్న వారికి కూడా బెన్ఫిట్ గా ఉంటుంది. మన దేహం పనిచేయాలంటే గ్లూకోజ్ ను శక్తివనరుగా ఉపయోగించుకుంటుంది. ఆహారం తీసుకున్న తరువాత శరీరంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. అదే కనుక మనం ఓ అరగంట నడిస్తే శరీరం శక్తిని ఉపయోగించుకుని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి ఉన్నవారిలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ సరిగా వినియోగించుకోకపోడమో.. ఇన్సులిన్ తగనంత ఉత్పత్తి కాకపోవడమో జరుగుతుంది. దీంతో బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అదే భోజనం అనంతరం నడిస్తే శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

ఇకనైనా మారిన జీవన శైలికి అనుగుణంగా కొన్ని పద్దతులు పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధుల్ని మన దరిచేరనీయకుండా ఉంటాం. తిన్న తరవాత నడకను అలవాటుగా చేసుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news