మనిషి ముఖంతో చేప.. చూస్తే షాకవ్వాల్సిందే..!

-

మానవ ముఖంతో ఒక చేప యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాదృచ్ఛికంగా, నీటిలో ఈత కొడుతున్నప్పుడు ఒక మహిళ ఈ చేపతో చిత్రీకరించింది. చైనాలోని మియావో గ్రామంలో ఓ మహిళ ఈ చేపను చూసి షాకై వెంటనే వీడియో తీసింది.

ఆ మహిళ దాన్ని తన మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో పెట్టింది. దీంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. ఆమె రికార్డ్ చేసిన వీడియోలో, చేపల ముఖం మానవ పోలికలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

మానవ ముఖాన్ని అచ్చుగుద్దినట్టు చేప ముఖం ఉండటం చూసి షాకవుతున్నారు. ఈ వీడియో ఇది కేవలం 14 సెకన్ల పాటు మాత్రమే ఉంది. ముఖ్యంగా ముఖంలో కళ్ళు, నోరు , ముక్కు, మానవ పోలికలో ఉన్నాయి.

ఓ టూరిస్ట్ కెమెరాకు ఈ వింతైన చేప చిక్కింది. దాని ముఖం అచ్చు మనిషిని పోలినట్టే ఉంది. మనిషి తరహాలోనే ఆ చేపకు ముక్కు, కళ్లు, నోరు ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది.

గతంలో ఇలాంటివి చాలా ఇంటర్ నెట్లో కనిపించాయి. అయితే వాటిలో చాలావరకూ మార్ఫింగ్ సృష్టే తప్ప వీడియోలు లేవు. కానీ ఈ వీడియో గ్రాఫిక్ మాయాజాలం కాదు. చేప కదలిక మనకు సులభంగా తెలిసిపోతుంది. అయితే ఇది పెద్ద విశేషమేమీ కాదంటున్నారు మత్స్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news