బరువు పెరిగిపోకుండా ఉండాలా..? అయితే వీటిని ఫాలో అవ్వాల్సిందే..!

-

చాలా మంది అధికంగా బరువు పెరిగి పోతున్నారని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు పెరిగి పోకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే మీరు కూడా ఎక్కువ బరువు పెరిగిపోతున్నారా..? ఎంత కంట్రోల్ చేసుకున్నా కుదరడం లేదా..? అయితే మీరు తప్పకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. వీటిని కనుక అనుసరించారు ఉంటే బరువు పెరగకుండా ఉండడానికి అవుతుంది దీనితో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

 

వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించండి:

ప్రతిరోజు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుంది అలానే బరువు తగ్గడానికి కూడా అవుతుంది. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వుండవు. అలానే కేలరీలు కూడా కరుగుతాయి.

స్వీట్ సోడాని తాగకండి:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల బరువు తగ్గి పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే అది మెటబాలిక్ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. బాగా బరువు పెరిగి పోవడానికి కారణం అవుతుంది. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి.

అతిగా తినద్దు:

బాగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యలు లేకుండా చూసుకోవాలి అంటే సరిగ్గా అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.

తినేటప్పుడు టీవీ చూడకండి:

చాలామంది ప్లేట్ లో ఏముంది అనేది కూడా చూసుకోకుండా టీవీ చూస్తూ తినేస్తుంటారు. దీనివల్ల కూడా బాగా బరువు పెరిగే అవకాశం ఉంది.

శరీరానికి సరిపడా నీళ్ళు తీసుకోండి:

శరీరానికి అవసరం అయ్యే అంత నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి. దీనితో మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవడానికి కూడా అవుతుంది.

బాగా నిద్రపోండి:

ప్రతి ఒక్కరు కూడా రోజుకి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. బరువు పెరిగిపోవడానికి నిద్ర కూడా కారణం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. బరువు కూడా పెరిగి పోరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version