వెన్నునొప్పి కారణంగా టీమ్ ఇండియాకు, ముంబై రంజీ టీమ్కు దూరమైన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకున్నారు. మార్చి 2 నుంచి తమిళనాడుతో జరిగే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆడనున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అతను రన్స్ చేయడంలో విఫలమైన సంగతి తెలిసిందే. మరోవైపు భారత టెస్ట్ జట్టుతో ఉన్న వాషింగ్టన్ సుందర్ను బీసీసీఐ రిలీజ్ చేసినట్లు సమాచారం. అతడు తమిళనాడు తరఫున రంజీ సెమీస్లో ఆడబోతున్నట్లు తెలుస్తోంది.
అంతకు ముందు…… ప్లేయర్ ఫిట్‌గా ఉంటే..దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఇటీవల సూచించినా అయ్యర్ మాట లెక్క చేయనట్లుగా తెలుస్తోంది.ఫిబ్రవరి 16న నుండి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో ఆడాలని ప్లేయర్స్ కు మెయిల్ చేసింది. అయితే అయ్యర్ రంజీ ట్రోఫీకి దూరంగా ఉంటూ ఐపీఎల్ కి ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం ఇండియా క్రికెట్‌లో చర్చ తారాస్థాయికి చేరుకుంది. ఇక తాజాగా శ్రేయాస్ అయ్యర్ మనసు మార్చుకుని రంజీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.