శృతికి బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్.. సలార్ లో ఫిక్స్

-

ఆ మధ్య కాలంలో ఒక ఫారినర్ తో ప్రేమలో పడిన శ్రుతిహాసన్ కెరీర్లో చాలా వెనకబడి పోయింది. ఒకానొక దశలో సినిమాలనే వదిలేస్తుంది ఏమో అని అనుకుంటున్న తరుణంలో ఆమెకు బ్రేక్ అప్ కావడంతో మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టింది. రీ ఎంట్రీ తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. బాగా తెలిసిన దర్శకులు అయిన గోపీ చంద్ లాంటివాళ్ళు ఈమెకు అవకాశాలు ఇచ్చారు. ఇక ఈమె తన పుట్టినరోజు నాడు ఒక బంపర్ ఆఫర్ కొట్టేసింది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ఈ భామ నటిస్తోంది. అయితే ప్రభాస్ కు హీరోయిన్ గా ఈ భామ నటిస్తోందా లేక మరేదైనా పాత్ర చేస్తుందా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సినిమా యూనిట్ లోకి ఆహ్వానిస్తున్నామని సలార్ సినిమా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఒక ట్వీట్ చేసింది. అయితే ఆమె హీరోయిన్ పాత్రలో నటిస్తుందా లేక మరేదైనా పాత్రలో నటిస్తోందా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news