ఆ రికార్డ్ లో బాబర్ ఆజామ్ కు ఎసరు పెట్టనున్న శుబ్మాన్ గిల్… !

-

ఆసియా కప్ లో ఇండియా మెరుగైన ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. కాగా ఫైనల్ లో శ్రీలంక లేదా పాకిస్తాన్ లలో ఒకరితో తలపడనుంది. కాగా ఈ ఆసియా కప్ లో ఇండియా పరుగుల వరదను పారిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ , కోహ్లీ , రాహుల్ , ఇషాన్ కిషన్ లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక ఆపదలో ఆదుకోవడానికి హార్దిక్ మరియు జడేజాలు ఎలాగో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఐసీసీ వన్ డే ర్యాంకింగ్ లో ఇండియా ఆటగాడు శుబ్మాన్ గిల్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఇంతకు ముందు మూఢవ స్థానంలో ఉన్న గిల్ ఇప్పుడు రెండవ స్థానంలోకి చేరుకున్నాడు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.. కాగా బాబర్ కు మరియు గిల్ కు మధ్యన కేవలం 104 పాయింట్లు మాత్రమే తేడా ఉంది.

ఈ ఆసియ కప్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఇండియా ఆడాల్సి ఉండగా.. ఇందులో గిల్ నిలకడగా పరుగులు చేసి బాబర్ ఫెయిల్ అయితే మొదటి స్థానం పోయినట్లే. మరి ఏమి జరుగుతుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news