నా బ్రా సైజు దేవుడు నిర్ణయించాడు…బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు….!

-

సెలబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. తేడాలు వస్తే నెటిజన్ల ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రతి ఒక్కరి మనోభావాలను దృష్టిలో ఉంచుకొని సెలబ్రిటీలు మాట్లాడాలి. ఎందుకంటే వారు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. అయితే తాజాగా ఓ బాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో ఇప్పుడు ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. బాలీవుడ్ నటి శ్వేతా తివారి సీరియల్స్ మరియు సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా “షో స్టాపర్” అనే వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు శ్వేతా తివారి సైతం హాజరయ్యింది. కాగా శ్వేతా తివారి మీడియాతో మాట్లాడుతూ….. వెబ్ సిరీస్ లో నటించిన హీరోయిన్ ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Swetha thiwari

ఈ వెబ్ సిరీస్ హీరోయిన్ బ్రా సైజును దేవుడు నిర్ణయించాడు అంటూ కామెంట్ చేసింది. దాంతో అక్కడ అ ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వెబ్ సిరీస్ లో నటించిన రచయిత సౌరబ్ రాజ్ జైన్ కు శ్వేతా తివారీ మైక్ ఇచ్చారు. దాంతో అతడు మాట్లాడుతూ….మేరా బ్రా సైజ్ భగవాన్ లే రహా హై అంటూ కామెంట్లు చేశాడు. ఈ సిరీస్ లో సౌరభ్ రాజ్ జైన్ బ్రా ఫిట్టర్ గా నటించాడు. దాంతో వీరిద్దరూ చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

వీరిద్దరు చేసిన కామెంట్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వీరి వెబ్ సిరీస్ ను బ్యాన్ చేయాలని కోరారు. ఇక మరో నెటిజన్ ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా కాకుండా ఎక్కడైనా మాట్లాడండి బహిరంగ ప్రదేశాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అంటూ కామెంట్ చేశాడు. మరికొందరు శ్వేతా తివారీ మరియు సౌరభ్ జైన్ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news