కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి : బోండా ఉమ

-

కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్నారు కాబట్టి ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బోండా ఉమ తెలిపారు. అన్ని ప్రాంతాల వారు రంగాకు విగ్రహాలు పెట్టి పూజిస్తారని.. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు కాబట్టి రెండో జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వెల్లడించారు. వంగవీటి రంగా పేరు పెట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వెల్లడించారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని టీడీపీ స్వాగతిస్తుంది.. కానీ ఎన్టీఆర్ తిరిగిన ఈస్ట్ కృష్ణాకు పెడితే బాగుండేదని.. వైసీపీ ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. ఎవరి ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారు అనేది సమాధానం చెప్పాలని అన్నారు.

మూడేళ్ళ నుండి అభివృద్ధి లేదు.. ఇప్పుడు కొత్త జిల్లాలు చేసి ఏమి చేస్తారని.. కిలోమీటరు రోడ్డు వేయలేదు.. కానీ కొత్త జిల్లాలు చేసి ఏమి సాధిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేరు కానీ కొత్త జిల్లాలని సీఎం బయలుదేరారన్నారు. కొత్త జీతాలు కాదు పాత జీతాలు ఇవ్వండి అని ఉద్యోగస్తులు పోరాటం చేయాలిసిన పరిస్థితికి తీసుకువచ్చారని.. కొత్త జిల్లాల్లో ఎక్కడ సమతుల్యత లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news