శ్యామ్ సింగరాయ్ నుంచి మరో అప్డేట్.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

-

నేచురల్‌ స్టార్‌ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాని చేసే ప్రతి సినిమా మినిమమ్‌ గ్యారంటీ హిట్‌ ఉంటుంది. ఇక తాజాగా టక్‌ జగదీష్‌ మూవీ తో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన నాచురల్‌ స్టార్‌ నాని… ఇప్పుడు వరుస సినిమా లతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ లో ఫుల్‌ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ”శ్యామ్ సింగరాయ్” సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు హీరో నాని మరియు హీరోయిన్‌ సాయి పల్లవి కలిసి ఉన్న పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.  ఈ  సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.  ఈ అప్డేట్‌ తో నాని ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news