సిద్దు జొన్నలగడ్డ టార్చర్ వల్ల మరో హీరోయిన్ కూడా జంప్..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా ‘టిల్లు 2 ను తీసుకొని వస్తున్నారు. ఇక ఈ సినిమా పై’ భారీ అంచనాలు వున్నాయి.ఈ మూవీని వచ్చే సంవత్సరం మార్చి నెలలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా పై వరసగా వివాదాలే వస్తున్నాయి. ఇందులో మొదట పార్ట్ లో హాట్ గా నటించి సినిమాకు మంచి ప్లస్ అయిన నేహాశెట్టికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. తర్వాత హీరోయిన్ శ్రీ లీల అనుకుంటే ఆమె రెమ్యునరేషన్ పెంచేసిన కారణంగా అంత బడ్జెట్ పెట్టలేక ఆమెను కూడా వదిలేశారు. ఆమె బదులుగా కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వన్ తీసుకున్నారు.

ఇక ఆమె కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చింది. ఆమె ప్లేస్ లో మలయాళ బ్యూటీ ‘మడోనా సెబాస్టియన్’ ‘DJ టిల్లు 2’లో హీరోయిన్ గాతీసుకున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆమె కూడా తప్పుకుంది అని అంటున్నారు మళ్లీ హీరోయిన్స్ వెతుకులాట మొదలు పెట్టారట.ఇక వారికి హిట్ 2’ హీరోయిన్ ‘మీనాక్షీ చౌదరి ఒక ఆప్షన్ గా ఉందట. ఇదంతా సిద్ధార్ద్ టార్చర్ వల్లే అని ప్రచారం జరుగుతోంది. సినిమా నిర్మాతలు కూడా ఆయనకే ఫుల్ పవర్స్ ఇచ్చారని అందుకే ఆయన హడావుడి చేస్తున్నారని అంటున్నారు.