బాలయ్య పాదాలను తాకిన సిద్ధూ జొన్నలగడ్డ.. ముద్దుపెట్టిన ఎన్‌బీకే!

-

నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాలు, ఇటు సినిమాలను ఓకే బ్యాలెన్స్ చేస్తుంటారు. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజా అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన వారికోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంటారు. అదేవిధంగా సినిమాలను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తూ తన వీరాభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఇటీవలికాలంలో ఆహా షో ద్వారా చాలా పాపులారిటీ పొందిన బాలయ్య.. తనకు నచ్చిన కుర్రహీరోల పేర్లను చెప్పుకొచ్చారు. ఆ లిస్టులో విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, అడవిశేష్ ఉన్నారు.

అయితే, ఏపీలో ఇటీవల సంభవించిన భారీ వరదలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలకు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ గురువారం ఏపీ సీఎం చంద్రబాబును మీట్ అయ్యేందుకు బాలయ్య బాబుతో కలిసి వెళ్లారు. ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. అంతకుముందు ఎయిర్ పోర్టులో బాలయ్యను చూడగానే సిద్ధూ ఆయన పాదాలను తాకి ఆశిర్వాదం తీసుకున్నారు.వెంటనే బాలయ్య సైతం సిద్ధూను హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news