ఏప్రిల్ 8న హనుమత్ జయంతి. ఈరోజున స్వామిని కింద పేర్కొన్న విధంగా ఆరాధిస్తే సకల శుభాలు కలగడమే కాదు సమస్త కార్యాలు జయం అవుతాయి. భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది.
ఏం చేయాలి ?హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఏప్రియల్ 8, చైత్ర పౌర్ణిమ నుండి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41…..(మీకు వీలైనన్ని సార్లు) హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది.
సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40 (మండలం) రోజుల పాటు కఠన బ్రహ్మచర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది. ఇక ఆలస్యమెందుకు కరోనాతో భయపడుతున్న ఈ రోజుల్లో మనల్ని రక్షించే ఆ హనుమంతుడి పాదాలను పట్టుకుందాం. స్వామి పాదసేవతో ఆయన కృపను పొందుదాం.
– శ్రీ