నిలకడగా బంగారం ధరలు… పెరిగే అవకాశం…!

దేశంలో బంగారం ధరల మీద కరోనా ప్రభావం గట్టిగానే పడుతుంది అనేది అర్ధమవుతుంది. గత కొన్ని రోజులుగా బంగారానికి భారీగా డిమాండ్ పడిపోయింది. అయినా సరే బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం ధరలే కొనసాగుతున్నాయి. అంటే 40,030 రూపాయల వద్ద ఉంది.

24 క్యారెట్ల బంగారం ధర కూడా స్తిర్మగా నిన్నటి ధర 43,030 రూపాయలగా ఉంది. వెండి ధరలు కూడా అంతే నిలకడగా ఉన్నాయి. కేజీ కి 40,360 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాములకు ఏ మార్పులు లేకుండా 40,030 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా అలాగే కొనసాగుతుంది. 44,030 రూపాయలుగా ఉంది బంగారం.

దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం ధరలు అలాగే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,260 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 41,960 రూపాయలగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో బంగారం పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో స్వల్ప మార్పులు వచ్చి లాక్ డౌన్ తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.