ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన నియోజకవర్గం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఆమె ప్రజల్లోకి నేరుగా వెళ్తున్నారు. ముందు నుంచి రోజా కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తన నియోజకవర్గంలో పోలీసులకు ఆమె స్వయంగా వంట చేసి అన్నం వడ్డించారు, మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఇప్పుడు ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి కోసం అండగా నిలబడ్డారు రోజా. ఎవరూ కూడా తన నియోజకవర్గంలో ప్రాణాలు కోల్పోవద్దు అని ఆమె ఎక్కువగానే కష్టపడుతున్నారు. తన నియోజకవర్గంలో రోజా ఇప్పుడు… గ్రామగ్రామాన, వాడవాడలా తిరుగుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో ఆమె స్వయంగా మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వాళ్లకు స్పష్టంగా పూసా గుచ్చినట్టు వివరిస్తున్నారు.
మాస్కులను పంచి పెడుతూ ఎవరూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు. ఇక సినీ కార్మికులకు కూడా ఆమె అండగా నిలిచారు. తన భర్తతో కలిసి దాదాపు రెండు వేల కేజీల బియ్యం ఆమె స్వయంగా అందిస్తున్నారు. ఇక తన నియోజకవర్గంలో ఉన్న దినసరి కూలీల దీనావస్థను గమనించిన ఆమె నిత్యాన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటున్నారు. అలాగే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను స్వయంగా అందిస్తున్నారు.