ఎంతో ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. అయితే క్యాన్సర్ కేవలం పెద్ద వారిలో మాత్రమే కాకుండా చిన్న పిల్లల్లో కూడా ఎదురవుతుంది. ముఖ్యంగా పిల్లల మెదడుకు సంబంధించిన క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుంది. కనుక కొన్ని సంకేతాలను పిల్లలు ఎదుర్కొన్నప్పుడు తల్లిదండ్రులు వాటిని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడు క్యాన్సర్ అంటే మెదడులో కణాలు అసాధారణంగా పెరగడం. మెదడుకు సంబంధించిన క్యాన్సర్ పెద్ద వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది, కాకపోతే పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
కనుక సరైన చికిత్సను వెంటనే తీసుకోవడం వలన తీవ్రత తగ్గుతుంది మరియు జీవించే అవకాశాలు పెరుగుతాయి. కనుక ఎప్పుడైతే క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలి, వెంటనే తగిన చర్యలను తీసుకోవాలి. ఎప్పుడైతే ఉదయం పూట ఎక్కువగా తలనొప్పి వస్తుందో లేక నిద్రలో తలనొప్పిని ఎదుర్కొంటారో, క్యాన్సర్ కు సంకేతాలు అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉదయం పూట ఎక్కువగా ఆహారంతో సంబంధం లేకుండా వాంతులు రావడం కూడా మెదడు క్యాన్సర్కు సంకేతం. కంటి సంబంధిత లక్షణాలు కూడా మెదడు క్యాన్సర్ సమస్యకు సూచనలుగా ఉంటాయి. కళ్ళు మసకబారడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.
అదేవిధంగా ఎప్పుడైతే సరైన విధంగా బ్యాలెన్స్ చేసుకోలేకపోయి తరచూ కిందపడుతూ ఉంటారో, అది మెదడు క్యాన్సర్ ను సూచించవచ్చు. కాబట్టి నడవడంలో ఇబ్బంది కనిపిస్తే తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్లో చిరాకు లేక ప్రవర్తనలో మార్పులు కనిపించినా కూడా జాగ్రత్తపడడం ఎంతో అవసరం. ఇటువంటి లక్షణాలతో పాటు అకస్మాత్తుగా చేతులు, కాళ్లు కదలకపోవడం లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా మెదడు క్యాన్సర్కు సంబంధించి ఉండొచ్చు. కనుక ఈ లక్షణాలను తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి, సరైన వైద్య సలహా తీసుకోవడం ఎంతో అవసరం.