ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సైలెంట్ షాక్ ఇచ్చింది. ఏ అధికారిని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దని ఏడు నెలలు పాటు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందో అదే అధికారిని ఆదాయపు పన్ను శాఖలో కీలక అధికారిగా పోస్టింగ్ ఇచ్చింది. ముందు ఐటి శాఖ కమీషనర్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వం… ఇప్పుడు ఐటి శాఖ చీఫ్ కమీషనర్ గా పదోన్నతి ఇచ్చింది. ఆయన ఎవరో కాదు జాస్తి కృష్ణ కిషోర్.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయన కీలక విధులు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) సీఈవోగా ఆయన పని చేసారు. అయితే నిధుల దుర్వినియోగం విషయంలో ఆయనపై అభియోగాలు మోపుతూ విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. ఆ తర్వాత ఆయన కేంద్ర పరిపాలాన ట్రిబ్యునల్ కి వెళ్ళగా ఆయనకు విధించిన సస్పెన్షన్ ని ఎత్తివేసింది. ఆ తర్వాత ఆయనకు మాతృ సంస్థకు వెళ్ళాలి అని ఆదేశిచింది.
దీనితో ఆయన ఆదాయపు పన్ను శాఖలో రిపోర్ట్ చేయడంతో ఆయనకు కమీషనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆయనకు ఐటి శాఖలో పదోన్నతి ఇచ్చింది కేంద్రం. కృష్ణకిశోర్‌కు కేంద్ర ఆర్థిక శాఖలో ఉన్న ట్రాక్ రికార్డ్ చూసిన కేంద్రం ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.