డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు సిల్వర్ పతకం

-

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్‌లోనూ అదే ధోరణి కొనసాగించాడు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఈవెంట్‌లో నీరజ్ చోప్రా తన జావెలిన్‌ను 89.94 మీటర్ల దూరంలోకి విసిరాడు. దీంతో అతడు సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నీరజ్ తన జాతీయ రికార్డును బ్రేక్ చేశాడు. జూన్ 14వ తేదీన నెలకొల్పిన జాతీయ రికార్డును గురువారం జరిగిన ఈవెంట్‌లో బద్దలు కొట్టాడు.

నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా

ఇటీవల తుర్కులో జరిగిన పావే నుర్మి గేమ్స్‌ లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.30 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డును నెలకొల్పాడు. అయితే డైమండ్ లీగ్‌లో తన రికార్డునే బ్రేక్ చేశాడు. డైమండ్ లీగ్‌లో వరల్డ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. పీటర్స్ తన జావెలిన్‌ను 90.31 మీటర్ల దూరం విసిరి కొత్త రికార్డు సృష్టించాడు. ఆండర్సన్ పీటర్‌ స్వర్ణ పతకం దక్కింది. కాగా, జులై 15 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలోని యూజీస్‌లో వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news