గుడ్ న్యూస్..ఇకపై ఇంటి వద్దకే సిమ్ కార్డులు..!

ఒకప్పుడు సిమ్ కార్డు తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు మరియు రెండు ఫోటోలు తీసుకుని స్టోర్ లు వెళ్లాల్సి వచ్చేది. అంతే కాకుండా ఒక పది సంతకాలు చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే సరిపోతుంది 5 నిమిషాల్లో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక ఇప్పుడు సిమ్ కార్డు ఇంటివద్ధకే రానుంది. కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే షాపుకి వెళ్లకుండా ఇంట్లో నుండే కొనుగోలు చేయవచ్చు.

ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ తెలి కమ్యునికేషన్స్ టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుండి టెలికాం ఆపరేటర్ ల వెబ్ సైట్ లో ఆధార్ అథెన్టికేషన్…ఈ కేవైసి సపర్పించి ధరకాస్తు చేసుకోవచ్చు. ఇక ధరకాస్తు చేసుకున్న వారికి ఇంటికే సిమ్ కార్డు కొరియర్ ద్వారా పంపించనున్నారు. అదే విధంగా పోస్ట్ పెయిడ్ మరియు ప్రీ పెయిడ్ మార్పును కూడా ఆన్ లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.