ప్రభుత్వం కీలక నిర్ణయం..రాష్ట్రంలో న్యాప్ కిన్ ల పంపిణీ..!

-

నవంబర్ 19న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి ఉండగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 19 నుండి రాష్ట్రం లోని మహిళలందరికీ న్యాప్ కిన్ లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ పథకం కోసం మొత్తం రూ. 200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ఇక న్యాప్ కిన్ లను రాష్ట్రం లోని అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాల లు, కళాశాలల కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని రాష్ట్ర ఆరోగ్య సేవల సంస్థ తయారు చేస్తోంది. ఇక రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఇందిరా గాంధీ పుట్టిన రోజున రాష్ట్రం లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news