హైదరాబాద్‌లో గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలు పురాతన కట్టడాలు కుప్ప కూలుతున్నాయి..మూసీ నది మహోగ్ర ఉగ్రరూపానికి అనేక బ్రిడ్జిలకు బీటలు బారుతున్నాయి..మూసీ వరద ప్రవాహానికి పూరానాపూల్‌లో నదిపై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి..వారం రోజుల్లో రెండు సార్లు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది..రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షానికి మూసీకి వరద ముంచెత్తింది..వరద కారణంగా పురాతనమైన పూరానాపూల్ బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడ్డాయి..
ప్రమాదాన్ని గుర్తించిన పోలీస్ అధికారులు ముందు జాగ్రత్తగా వంతెనను మూసివేశారు..వంతెనపై నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు..జియాగూడ, కార్వాన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పూరానాపూల్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు. కాగా, వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నికల్ టీంను రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు.