సింగర్ గీతామాధురి భర్తకు యాక్సిడెంట్..!

-

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ విషయం ఎలా జరుగుతుందో చెప్పడం అసాధ్యం ఈ క్రమంలోనే కొంతమంది అనారోగ్య బారిన పడితే మరికొంతమంది స్వర్గస్తులవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి భర్త .. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందు తాజాగా యాక్సిడెంట్ కే గురైనట్లు తెలుస్తోంది సింగర్ గీతామాధురి భర్తగా.. ఇటీవల హీరోగా కూడా మారిన నందుకి టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది.

కెరియర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన ఈయన చివరికి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. గతంలో సవారి సినిమాతో ఒక మోస్తారుగా హిట్టు కొట్టిన నందు ఇప్పుడు తన అదృష్టాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇటీవల జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాను చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంతగా వర్క్ అవుట్ కాలేదు. దీంతో బీస్ట్ మోడీ లోకి మారిపోయారు నందు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయనకు చిన్న యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. కాలికి పట్టి కట్టినట్టు ఆ ఫోటోలో ఉంది. అయితే ఇది ఎలా జరిగిందనే విషయం మాత్రం ఇంకా బయటకు చెప్పలేదు ప్రస్తుతం నందు క్రికెట్ కామెంటరీ , సినిమాలు అంటూ ఫుల్ బిజీగా తిరుగుతున్నాడు.. ఇలాంటి సమయంలోనే ఇలాంటి ఘటన జరగడంతో గీతామాధురి ఎమోషనల్ అవుతోందని సమాచారం. ఇకపోతే తాజాగా డబ్బింగ్ రూంలో కొంచెం కూల్ గా కనిపించేసరికి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయనకు ఏం జరిగింది? ఎందుకలా పట్టి కట్టారు? అని తెలియక అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news