బ్రేకింగ్ : సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. రైల్వే పట్టాలపై తేలిన శవం

ప్రముఖ సింగర్‌ హరిణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సింగర్‌ హరిణి తండ్రి ఏకే రావు మృత దేహం బెంగుళూరు లోని రైల్వే ట్రాక్‌ పై లభించింది. వారం రోజులు గా హరిణి కుటుంబ సభ్యుల ఫోన్లు పని చేయడం లేదు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో ఏకే రావు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన అనంతరం… ఏకే రావు సుజనా పౌండేషన్‌ కు సీఈఓ గా పనిచేస్తున్నాడు.

ఈ మధ్యలోనే.. ఆమె తండ్రి ఏకే రావు అదృశ్యం అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌ పై శవంగా కనిపించారు. ఇప్పటి వరకూ జాడ లేకుండా పోయిన ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్‌స్టేషన్‌ కు వచ్చారు. వీళ్లకు వీళ్లుగా వెళ్లిపోయారా.. ఏకే రావు ది మర్డరా లేదా సుసైడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ కేసుపై నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.