టీఆర్ఎస్ బిగ్ షాక్..నేడు కాంగ్రెస్ లో చేరనున్న కీలక నేత

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ గా ఎంపీ రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి… కాంగ్రెస్‌ పార్టీ లో కొత్త జోష్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు.. వెళ్లడమే తప్పా… పార్టీలోకి ఎవరూ రాకపోయేదు. కానీ రేవంత్‌ రెడ్డి పీసీసీగా బాధ్యతుల చేపట్టిన అనంతరం.. కాంగ్రెస్‌ పార్టీ లో చేరేందుకు అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది.

నేడు కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు టిఆర్ఎస్ ఎన్ ఆర్. ఐ నాయకులు అభిలాశ్ రావ్. గాంధీ భవన్ లో సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకొనున్నారు అభిలాశ్ రావ్. కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన అభిలాశ్ రావ్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్ అమెరికా విభాగంలో కీలకంగా పని చేసారు. గత కొన్ని రోజుల నుంచి టీఆర్‌ఎస్‌ పై అసంతృప్తి గా ఉన్న ఆయన ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్‌ లో చేరనున్నట్లు తెలుస్తోంది.