ఢిల్లీకి పోయి పొడుస్తమ్.. అని ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు… కేసీఆర్ టూర్ పై వైఎస్ షర్మిళ

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వరిధాన్యం కొనుగోలు అంశంపై తాడోపేడో తెల్చుకుంటామని చెప్పిన కేసీఆర్..ఏమీ తేల్చక వచ్చారని విమర్శిస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

Sharmila

వైఎస్ షర్మిళ ట్విట్టర్ లో స్పందిస్తూ… 3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన కేసీఆర్ కథ, 3ఏండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయింది. ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్ లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు. అపాయింట్ మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు. ఒక పక్క రైతులు కల్లాల్లో ధాన్యం పెట్టుకొని, వర్షానికి తడుస్తూ గుండెలు చెరువై కుప్పలపైనే ప్రాణాలు విడుస్తుంటే, మీ హుజురాబాద్ ఓటమిని జనాలు మర్చిపోవాలని, వరి కిరికిరి అని ధర్నా డ్రామాలతో ఢిల్లీ తీర్థ యాత్రలకు పోయింది చాలు.యాసంగి పక్కన పెట్టి కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనండి అంటూ వ్యాఖ్యానించింది.