సింగర్ స్మిత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాప్ సింగర్‌గా తెలుగు నుంచి ఉన్న ఏకైక గాయనిగా, తన ఆల్బమ్స్‌తో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది స్మిత. కుర్రకారునంతా తన పాటలతో మాయచేసింది స్మిత. హాయ్ రబ్బా హాయ్ అనే పాట ఒక్కసారిగా స్మితను లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. నాటి క్లాసిక్ సాంగ్స్‌ను నేటి తరానికి తగ్గట్టుగా రీమిక్స్ చేసి ఎన్నో సంచలనాలు నమోదు చేసింది.
మసక మసక చీకటిలో, సన్నజాజి పాడాక లాంటి క్లాసిక్ సాంగ్స్ రీమిక్స్ కూడా ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాయి. అనుకోకుండా ఒకరోజు సినిమాలోని ఎవరైనా చూసుంటారా అనే పాటను కూడా స్మిత పాడింది. కొన్ని సినిమాల్లోనూ నటించిన స్మిత.. మల్లీశ్వరీ సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించి మెప్పించింది. తాజాగా స్మిత చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సీఎం వైఎస్ జగన్‌పై ఫైర్ అవుతూ కుల ప్రస్థావన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
?? idi nijam pic.twitter.com/HbFhAz2CxF
— Smita (@smitapop) March 17, 2020
అయితే స్మిత చేసిన ట్వీట్ ఈ విషయాన్ని ఉద్దేశించేట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత గుర్రం జాఘువా మాటలను పోస్ట్ చేసిన స్మితకు పెద్ద తలనొప్పి ఎదురయ్యేట్టుగా ఉంది. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు..మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు.. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు..జనులంతా ఒక కుటుంబం..జగమంతా ఒక నిలయం.. అని ఒక్క దాన్ని పోస్ట్ చేస్తూ.. ఇది నిజం అంటూ కామెంట్ చేసింది.
ఇక ఈ ట్వీట్‌కు స్పందించిన నెటిజన్స్.. ఎవరికీ కుల పిచ్చి ఉందో బాగా తెలుసు.. చంద్రబాబు నాయుడిని ఏమైనా అంటేనే స్పందిస్తావా? పతివ్రత పాయసం వండితే వారం రోజులు చల్లార లేదట అంటూ ఇష్టమొచ్చినట్టుగా స్మితపై రెచ్చిపోయారు.