సింగర్ సునీత రెండో పెళ్లి.. వరుడు ఆయనే !

-

టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమవుతున్న టు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సునీత చిన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. అయితే విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న ఆమె తాజాగా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఒక లీడింగ్ డిజిటల్ మీడియా అధినేతగా ఉన్న ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈమెకు ఇది రెండో పెళ్లి కాగా ఆ వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లి అని చెబుతున్నారు.

అయితే గతంలో కూడా సునీత పెళ్లికి సంబంధించి అనేక వార్తలు ప్రచారం జరిగాయి కానీ అవేవీ నిజం కాలేదు. మరి ఈసారైనా ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందో లేక ఇదంతా ఒట్టి ప్రచారమో తెలియాల్సి ఉంది. నిజానికి కొద్ది రోజుల క్రితం ఝాన్సీ తో కలిసి ఆలీతో జాలీగా అనే ఒక టాక్ షోలో పాల్గొన్న సునీత తనకు సింగిల్ జీవితం నచ్చిందని జీవితాంతం సింగిల్ గానే ఉండిపోతానని చెప్పుకొచ్చింది. కానీ ఆ షో టెలికాస్ట్ అయిన కొద్ది రోజులకే ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news