ధనుష్ “సార్” రిలీజ్ డేట్ ఫిక్స్

-

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించబోతున్నారు. ధనుష్ ఎన్నాళ్ల నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన ధనుష్ ఆతరువాత మారి, వీఐపీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించారు.

తాజాగా ’సార్ ‘ అనే చిత్రం ద్వారా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. దీన్ని తమిళంలో ’వాతి‘గా నిర్మిస్తున్నారు.గతంలో రంగ్ దే, తొలిప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి దర్శకత్వంతో ధనుష్ “సార్” సినిమా రాబోతోంది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. సార్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ను చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 2, 2022 న థియేటర్లలో విడుదల కానుంది అని తెలిపారు. మేకర్స్ తమ సోషల్ ప్రొఫైల్ లకు వెళ్లి అదే విషయాన్ని సరికొత్త పోస్టర్ తో ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news