సిరాజ్ మీద సోషల్ మీడియాలో ప్రసంశల వర్షం

టీమిండియా పేసర్ సిరాజ్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే ఆయన తండ్రి రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళిన సిరాజ్ అక్కడ క్వారంటైన్ నిబంధనల ప్రకారం అక్కడే ఉండాల్సి రావడంతో అభిమానులు అందరూ చాలా బాధ పడ్డారు. అయితే ఈ విషయం మీద బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది, ఆయన తిరిగి ఇండియా వచ్చేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడి అంతా సిద్ధం చేసింది.

అయితే తాను మాత్రం వెనక్కి వెళ్లనని తన తండ్రికి ఇచ్చిన మాట కోసం జట్టుతోనే ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయనను కొనియాడుతూ నెటిజన్లు సిరాజ్ కు సోషల్ మీడియాలో మద్దతుగా నిలుస్తున్నారు. సిరాజ్ భారత్ తరఫున ఒక వన్డే, మూడు టి 20 మ్యాచ్ లు ఆడాడు. ఈ పేసర్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇంకా వికెట్ బోణీ చేయలేదు, అయితే టీ 20ల్లో అతనికి మూడు వికెట్లు ఉన్నాయి. 26 ఏళ్ల ఈ ఆటగాడు ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆడాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు కోసం ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయగలిగాడు.