బంజారా హిల్స్ లో బెంజ్ కారు బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు !

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి అతివేగంగా వచ్చి అదే రోడ్డులో వెళ్తోన్న ఇండికా క్యాబ్ ని బెంజ్ కార్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇండికా క్యాబ్ లో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పబ్ లో పీకలదాకా తాగి రోడ్డు మందుబాబులు ఈ బెంజ్ కారు వేసుకుని రోడ్డు ఎక్కినట్టు చెబుతున్నారు. కారులో ముగ్గురు యువకులు, ఓ అమ్మాయి ఉన్నారు.

కారు నడిపిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిని బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్ గా మారిందని అంటున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.