మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం..

-

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ అయ్యిందని తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలేత్తడంతో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా నవంబర్ 2న గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎం సిహెచ్) లో చేరినప్పటి నుంచి నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ (ఎన్ఐవి) లో ఉన్న ఈ 86 ఏళ్ల ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిని ఇప్పుడు ఇన్వాసివ్ వెంటిలేషన్ కింద ఉంచారని మంత్రి చెప్పారు. నిన్న మధ్యాహ్నం సమయంలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో అతని పరిస్థితి క్షీణించింది.

కాబట్టి, వైద్యులు ఒక ఇంట్యూబేషన్ వెంటిలేటర్‌ను ప్రారంభించారు, ఇది మెషిన్ వెంటిలేషన్ అని ఆయన ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చిన శర్మ అన్నారు. తరుణ్ గొగోయ్ “పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నారని. ” మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ అయిందని అంటున్నారు. ఆయన అవయవాలను, మందులు మరియు ఇతర మార్గాలతో పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైద్యులు కూడా డయాలసిస్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే, రాబోయే 48-72 గంటలు చాలా క్లిష్టమైనదని అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news