హైద‌రాబాదీ హిందీ యాస‌లో ముచ్చ‌టించిన సిరాజ్‌.. వీడియో..

-

హైద‌రాబాదీ క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టు త‌ర‌ఫున ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్టులో ఆడుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే సిరాజ్ త‌న కెరీర్‌లో ప్ర‌స్తుతం తొలి టెస్టు ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో సిరాజ్ త‌న తొలి మ్యాచ్‌లోనే ఆక‌ట్టుకునే ప్ర‌దర్శ‌న చేశాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో రెండు కీల‌క ఆస్ట్రేలియా వికెట్లు తీసి ఆక‌ట్టుకున్నాడు. కాగా సిరాజ్ తో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్‌.శ్రీ‌ధ‌ర్ హైద‌రాబాదీ హిందీ యాస‌లో ముచ్చ‌టించి అల‌రించారు.

మెల్‌బోర్న్ టెస్ట్ సంద‌ర్భంగా ఫీల్డింగ్ కోచ్ ఆర్‌.శ్రీ‌ధ‌ర్‌, సిరాజ్‌లు హైద‌రాబాదీ హిందీ యాస‌లో కాసేపు స‌ర‌దాగా ముచ్చ‌టించారు. హైద‌రాబాద్‌కు ఇంత‌కు ముందు ల‌క్ష్మ‌ణ్ వ‌స్తాద్‌గా ఉండేవాడు, ఇప్పుడు సిరాజ్ ఫాస్ట్ బౌల‌ర్‌గా ఉన్నాడ‌ని శ్రీ‌ధ‌ర్ అన్నారు. ఇక ల‌క్ష్మ‌ణ్ త‌రువాత ఆస్ట్రేలియాతో ఆడుతున్న హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌వి నువ్వు, ఎలా ఫీల‌వుతున్నావ‌ని శ్రీ‌ధ‌ర్ అడ‌గ్గా.. అందుకు సిరాజ్ బ‌దులిస్తూ.. త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపాడు. త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన కెప్టెన్ ర‌హానేకు సిరాజ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

అలాగే బంతిని మొద‌ట్లో స్వింగ్ చేయ‌లేక‌పోయావు, త‌రువాత అల‌వోక‌గా స్వింగ్ చేశావు ? అందుకు సీక్రెట్ ఏమిటి ? అని శ్రీ‌ధ‌ర్ అడ‌గ్గా.. అందుకు సిరాజ్.. అది త‌న‌కు స‌హ‌జ‌మేన‌ని, స్టంప్స్‌కు ద‌గ్గ‌ర‌గా బౌలింగ్ చేస్తున్నాన‌ని, కొన్ని సార్లు దూరంగా బంతులు విస‌రుతున్నాన‌ని, నాచుర‌ల్‌గానే స్వింగ్ రాబ‌డుతున్నాన‌ని.. తెలిపాడు. కాగా వారిద్ద‌రి సంభాష‌ణ తాలూకు వీడియోను ఫ్యాన్స్ ఆస‌క్తిగా తిలకిస్తున్నారు. ‌

Read more RELATED
Recommended to you

Exit mobile version