కోట్లు గడిస్తున్న ఫాస్టాగ్…. ఎందుకో తెలుసా….!?

-

జనవరి 1 నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నూతన ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో జనవరి 1 నుంచి వంద శాతం టోల్ వసూలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పాటు టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి పలకనుంది. తద్వారా ప్రయాణీకులు టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగే బాధ తప్పనుంది. 2021 జనవరి 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇకపై ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న కార్లను మాత్రమే టోల్ గేట్ల దగ్గర అనుమతిస్తారు.

ఈ మేరకు భారతదేశంలోని మొత్తం ఫోర్ వీలర్ వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI చేత పరిచయం చేయబడిన, ఈ ఫాస్ట్ ట్యాగ్ విధానం అనేది కారు విండ్‌షీల్డ్‌లో అతికించడానికి ఒక స్టిక్కర్. ఇది టోల్ ప్లాజాల వద్ద టోల్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ సేకరణను అనుమతిస్తుంది. మన వాహనాల విండ్స్క్రీన్పూ ఉంచే ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది టోల్ ప్లాజాలోని స్కానర్కు నేరుగా కనెక్ట్ అవుతుంది. తద్వారా మన ఖాతా నుంచి డబ్బులు నేరుగా కట్ అయిపోతాయి టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే తప్ప జనవరి 1 నుంచి అనుమతి ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాహన యజమానులు తమ ఫాస్ట్ ట్యాగ్లను ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసుకోవాలి. సాధారణ సేవా కేంద్రాలు, పెట్రోల్ పంపులు, బ్యాంక్ శాఖల్లో ట్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు. నూతన సంవత్సరంలో చేతిలో అది లేకపోతే రోడ్లపై వాహనాలకు నో ఎంట్రీ..నో ఎగ్జిట్. అందుకే ఒక్కసారిగా జనం కొనుగోళ్లు ప్రారంభించారు. ఒక్కరోజులోనే 80 కోట్ల టోల్ వసూలైందంటే ఆ ట్యాగ్ ప్రాముఖ్యత అర్దం చేసుకోవచ్చు..

వాహనదారులందరికీ ఇప్పుడు ఫాస్టాగ్ పైనే దృష్టి పడింది. ఇప్పటికే తీసుకున్నవారు ఊపిరి పీల్చుకుంటుంటే..తీసుకోనివారు ఆందోళనగా ఉన్నారు. డిసెంబర్ ౩ఓ లోగా తప్పనిసరిగా తీసుకుతీరాలి. లేదంటే రోడ్లపై నో ఎంట్రీ..నో ఎగ్జిట్ కూడా. 2021 జనవరి 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని 4 చక్ర వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించడం, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

గడువు ముగుస్తుండటంతో వాహనదారులు ఒక్కసారిగా ఫాస్టాగ్ కొనుగోళ్లు ప్రారంభించారు. డిసెంబర్ 24 వ తేదీన అంటే ఒక్క రోజులో దేశవ్యాప్తంగా వివిధ టోల్‌గేట్ల నుంచి 50 లక్షల ఫాస్టాగ్ అమ్మకాలు జరిగాయి . అంటే ఒక్కరోజులోనే టోల్ ఆదాయం ఫాస్టాగ్ ద్వారా 80 కోట్ల దాటినట్టు నేషనల్ హైవే అథారిటీ ప్రకటించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2.20 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version