సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన జాతీయ మహాసభలో పార్టీ పొలిట్ బ్యూరో మేరకు ఈ నిర్ణయం తీసుకుంది సిపిఎం పార్టీ అధిష్టానం. ఈ సమావేశాల్లో చివరి రోజైన ఆదివారం.. పార్టీ జాతీయ కార్యదర్శిగా ఏచూరి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక కావడం ఇది మూడోసారి.
వరుసగా మూడో సారి ఆయన ఈ బాధ్యతలను చేపడుతున్నారు. ఇంకా జాతీయ ప్రధాన కార్యదర్శి గా సీతారాం ఏచూరి ఎన్నిక కావడం పై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ… సిపిఎం పార్టీని మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకు వెళ్తానని స్పష్టం చేశారు. తామంతా ఏకధాటిగా ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేశారు. కార్పోరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.