కరోనా లాక్ డౌన్ లో పేదల ఆకలి తీర్చిన వాళ్ళే నిజమైన దేవుళ్ళు. కరోనా వైరస్ కట్టడి చేయలేని ప్రభుత్వాలు పేదల ఆకలి తీర్చడంలో కూడా వెనకడుగు వేస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నా సరే పేదల ఆకలి మాత్రం తీరే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రజల్లో ఉంటూ వారికి కావాల్సినవి సమకూరుస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇలాగే ప్రజలకు అండగా నిలిచారు.
తన ములుగు నియోజకవర్గం చాలా వరకు సమస్యాత్మక ప్రాంతం. మావోయిస్ట్ లు కూడా తిరిగే ప్రాంతం. అయినా సరే సీతక్క ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రతీ రోజు నిత్యావసర సరుకులను తీసుకుని వెళ్తూ రాత్రి 10 గంటల వరకు కష్టపడుతున్నారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు ఆమె. వారికి ఏ కష్టం వచ్చినా సరే తాను ఉన్నాను అంటున్నారు ఆమె.
ఆదివాసి గిరిజనులు సహా నియోజకవర్గంలో వేలాది మంది ఆకలితో ఉన్నారు. ఇప్పుడు ఇలాగే చెయ్యాలి దేశం మొత్తం అని ఒక చాలెంజ్ మొదలుపెట్టారు ఆమె. #GoHungerGo పేరుతో ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా .. ఉపాధి కోల్పయిన పేదవారికి నిత్యావసర సరుకులు అందించాలని సోషల్ మీడియాలో ఆమె విజ్ఞప్తి చేసారు. మొదట ఈ ఛాలెంజ్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై , ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి విసిరారు.