మొదట్లో కరోనా లక్షణాలు అంటే… జ్వరం, దగ్గు, జలుబు! ఆ తర్వాత మరో కొన్ని… ఇప్పుడు తాజాగా మరో ఆరు లక్షణాలు కరోనా లక్షణాల లిస్టులో యాడయ్యాయి! సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం ప్రకారం… కొన్ని కొత్త లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. ఇపుదు మనం చెప్పుకునే లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకపోవదమే మంచింది!
ఈ కొత్త కరోనా లక్షణాలలో మొదటిది… రుచి లేదా వాసన గ్రహించే శక్తి కోల్పోవడం! అవును… బ్రిటన్‌లో కరోనా వ్యాధిగ్రస్తుల్లో చాలామందికి ఇలాంటి లక్షణం ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. దీని ద్వారా తమకు తెలీకుండానే ఇతరులకు వైరస్‌ను అంటించే ప్రమాదముందని సీడీసీ పేర్కొంది. ఇక రెండో కొత్త లక్షణం.. చలి! అవును… చలి పెడుతుంటే వాతావరణంలో మార్పు కదా అనుకోకుండా.. ఊరికే చలి పెడుతుందంటే ఆ మాటను తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే ఇది కూడా వ్యాధి లక్షణమే!
ఈకొత్తలక్షణాల్లో మూడవది.. వణకడం! అవును… కరోనా బారిన పడ్డ ఒక వ్యక్తి చలి వణుకు కారణంగా పల్లు పటపట కొరుకుతూ పళ్లూడగొట్టుకోవడంతో ఈ లక్షణం బయటపడింది. కాబట్టి ఎండలో కూడా చలిపెడుతుందంటే ఆలోచించాల్సిందే! ఎలాంటి కారణం లేకుండానే చలితో వణకడం కూడా కోవిడ్ ప్రధాన లక్షణం అని మరిచిపోకూడదు. అలాగే కండరాల నొప్పి కూడా కరోనా కొత్తలక్షణాల్లో నాలుగోది! అమెరికాలో సుమారు 14 శాతానికి పైగా కరోనా బాధితుల్లో ఈ లక్షణం వెలుగు చూసిందట. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిని కండరాల నొప్పి వేధించడం సహజమే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే… కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ లక్షణం కూడా బయటపడింది కాబట్టి!
ఇక తలనొప్పి అనేది కరోనా కొత్త లక్షణాల్లో ఐదవది! జలుబు ఉన్నప్పుడు తలనొప్పి రావడం అత్యంత సర్వసాధారణం. అయితే తల తిరుగుతున్నట్లు అనిపించినా, తలంతా బాగా నొప్పిగా అనిపించినా దాన్ని తేలికగా తీసిపారేయడానికి లేదు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో తలనొప్పి కూడా ఒకలక్షణంగా కనిపిస్తోందని అధ్యయనం పేర్కొంది. ఇక ఈ కొత్త లక్షణాల్లొ చివరిది గొంతు మంట! అవును… సుమారు 60 శాతానికి పైగా కేసులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నవారికి కూడా వస్తున్నాయంట. కాబట్టి… సాధారణ సమయాల్లో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇందులో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందేనని చెబుతున్నారు.