ఏపీ చుట్టూ సరిహద్దు గోడలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న పలు రాష్ట్రాలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకి కరోనా ఏపీలో పెరగడంతో సరిహద్దున ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు సరిహద్దులను పూర్తిగా మూసి వేస్తున్నాయి. ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లో గోడ కట్టారు వేలూరు జిల్లా ప్రజలు. ఇక తాజాగా కర్ణాటక సరిహద్దుల్లో కూడా గోడ కట్టారు.

ఓడిస్సా ప్రజలు కూడా ఏపీ నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దుల వద్ద రోడ్డు మీద గుంతలు తవ్వుతున్నారు. దీనితో అక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ నుంచి ఎవరూ రావొద్దు, తాము కూడా ఎపీకి వచ్చేది లేదని స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణా సరిహద్దులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూసి వేసింది.

అయినా సరే పొలాల నుంచి వెళ్ళాలి అని కొందరు చూస్తుండగా గ్రామస్తులు అందరూ కూడా ఇప్పుడు గ్రామాల్లో పూర్తిగా కంచెలు ఏర్పాటు చేసి ఏపీ నుంచి ఎవరూ రాకుండా చూడాలి అని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రోడ్డుకు అడ్డంగా 6 అడుగుల ఎత్తున రాత్రికి రాత్రే గోడలను కట్టేశారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్‌తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను కట్టగా వాటిని కూల్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news