నాన్న నువ్వు తప్పించుకోలేవు.. సితార వైరల్ వీడియో..?

మహేష్ బాబు గారాల పట్టి సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను నెటిజన్లతో పంచుకుంటూ అంతకంతకు అభిమానులను పెంచుకుంటూ పోతుంది మహేష్ బాబు కూతురు సితార. అంతేకాదు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సితార పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

సితార తన తండ్రి మహేష్ బాబును వీడియో తీస్తున్న సమయంలో సితార కెమెరా నుంచి మహేష్ బాబు తప్పించుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఎలాగోలా మహేష్ బాబును వీడియో తీస్తుంది సీతారా. ఇక దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సితార నాన్న నువ్వు నాకు కెమెరా నుంచి తప్పించుకోలేవు అంటూ ట్యాగ్లైన్ కూడా ఇచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు అభిమానులు మురిసిపోతున్నారు.  https://www.instagram.com/p/CILwjEpH3_j/?utm_source=ig_web_copy_link