సితార క్లాప్, నమ్రత స్విచ్ ఆన్.. సర్కారు వారి పాటకు ముహూర్తం ఫిక్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… కీర్తి సురేష్ హీరోయిన్ గా.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్నది . ఇక ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు జరగ్గా మహేష్ బాబు గారాలపట్టి సితార ఈ సినిమాకు క్లాప్ కొట్టింది.

ఇక మహేష్ బాబు సతీమణి నమ్రత కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇక దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది, 2021 జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.