నల్గొండ జిల్లాలో కలకలం, ఒక్క రోజే ఆరుగురికి కరోనా..!

-

నల్గొండ జిల్లాలో కలకలం రేగింది… ఒక్క రోజే జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పుడు జిల్లా ప్రజలు అందరూ కూడా ప్రాణ భయంతో ఉన్నారు. వీరు అందరూ కూడా ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే అని అధికారులు గుర్తించారు. దీనితో ఇంకా వాళ్ళు ఎంత మంది ఉన్నారా అనేది దాని మీద అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు.

కరోనా సోకినా వారిలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక మహిళ, నల్లగొండ పట్టణానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడం తో జిల్లా యంత్రాంగం ఒక్కసారే అప్రమత్తమైంది. ఇక ఢిల్లీ లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మరికొంత మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 399 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, వీరంతా ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్నారని అధికారులు చెప్తున్నారు.

జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 45 మంది జాబితా ఉందని, వారికి పరీక్షలు చేసి ఫీవర్ ఆస్పత్రికి పంపినట్టు జిల్లా డీఎంహెచ్ఓ కొండలరావు మీడియాకు వివరించారు. 45 మందిలో 34 మందికి నెగిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో పెట్టామన్న ఆయన… కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురిని ఫీవర్ ఆస్పత్రిలో చేర్చామని, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఆయన.

Read more RELATED
Recommended to you

Latest news