ఘోర ప్రమాదం : స్పాట్ లో ఆరుగురు మృతి !

Join Our Community
follow manalokam on social media

శనివారం రాత్రి జలూర్ జిల్లా మహేష్‌పూర్‌లో విద్యుత్ తీగ తగలడంతో నడుస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ఆరుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో జరిగిందని జలూర్ అదనపు జిల్లా కలెక్టర్ చాగన్ లాల్ గోయల్ తెలిపారు. బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

“గాయపడిన 17 మందిలో ఏడుగురిని జోధ్పూర్ ఆసుపత్రికి పంపారు. అయితే, బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ అక్కడికక్కడే మరణించారు, ఆసుపత్రిలో చికిత్స సమయంలో నలుగురు మరణించారు” అని గోయల్ చెప్పారు. అర్థరాత్రి కావడంతో డ్రైవర్ విద్యుత్ తీగలను చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సంతా కరెంట్ షాక్ కు గురయ్యింది. ఈ సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు వుండగా అందరూ కరెంట్ షాక్ కు గురయ్యారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...